![]() |
![]() |
.webp)
బుల్లితెర ధారావాహికలు రోజు రోజుకి ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ' కృష్ణ ముకుంద మురారి ' సీరియల్ లో నిన్న మొన్నటి దాకా సప్పగా సాగిన ఎపిసోడ్ లు కాస్త ఇప్పుడు అదరహో అనిపిస్తున్నాయి.
ఈ సీరియల్ కథేంటంటే.. ముకుంద, మురారి మొదట ప్రేమించుకుంటారు కానీ కొన్ని కారణాల వల్ల కృష్ణని మురారి పెళ్ళి చేసుకుంటాడు. ఆ తర్వాత అదే ఇంటికి అదర్శ్ ని పెళ్ళి చేసుకొని ముకుంద వస్తుంది. ఇక పెళ్ళి తర్వాత మురారిని చూసి తన ప్రేమను మర్చిపోలేక తనతో మాట్లాడుతుంది. ఇక అదే సమయంలో మురారి, ముకుందల ప్రేమ విషయం ఆదర్శ్ తెలుసుకొని శోభనం రోజే మిలటరీ డ్యూటీకి వెళ్తాడు. ఇక తాజా ఎపిసోడ్ లలో అదర్శ్ ని కృష్ణ, మురారి కలిసి తోసుకొస్తారు. ఇక ముకుంద, ఆదర్శ్ ల శోభనానికి ఏర్పాట్లు చేయగా.. పాలగ్లాస్ తో ముకుంద గదిలోకి వెళ్తుంది. ఇక ఆదర్శ్ కి నిజం చెప్పేస్తుంది ముకుంద. నా మనసులో ఇప్పటికి ఎప్పటికి మురారీనే ఉన్నాడు.. ఉంటాడు అని ముకుంద చెప్పడంతో తన చెంప చెల్లుమనిపిస్తుంది కృష్ణ. ఇక ముకుందని కృష్ణ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. నా భర్తని కావలనుకుంటున్నావ్.. నీ సిగ్గులేని జన్మకు పౌరుషం కూడానా.. ఇలాంటి బతుకు బతికినా ఒక్కటే చచ్చినా ఒక్కటే అని కృష్ణ అంటుంది. కృష్ణా తప్పు చేస్తున్నావ్.. ఇంతకు ఇంత అనుభవిస్తావని ముకుంద అంటుంది ముకుంద. తప్పు చేసింది నువ్వైతే నేనెందుకు అనుభవిస్తానని కృష్ణ అంటుంది. అనుభవిస్తావ్.. నన్ను ఇంతమంది ముందు కొట్టావ్.. నానామాటలు అన్నావ్.. నువ్వు అనభవిస్తావ్ కృష్ణా.. తప్పకుండా అనుభవిస్తావ్. ఆ రోజు ముకుందను ఎందుకు అంత అవమానించానా అని బాధపడే రోజు వస్తుంది.. గుర్తుపెట్టుకో కృష్ణా అని ముకుంద అంటుంది. వెంటనే ముకుంద ఏడ్చుకుంటూ అక్కడి నుంచి బయటికి పరుగున వెళ్లిపోతుంది.
మరునాడు ఉదయాన్నే ఆదర్శ్ నట్టింట్లో కూర్చుని మందు తాగుతాడు. అది చూసి కృష్ణ, మురారీ ఫీల్ అవుతారు. తరువాయి భాగంలో న్యూస్ ఛానల్‌లో ముకుంద మరణ వార్త ఇంట్లో వాళ్లను కుదిపేస్తుంది. ‘సుమారు 30 ఏళ్లు ఉండే యువతి నిన్న రాత్రి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టి.. మృతి చెందిది’ అంటూ న్యూస్ రీడర్ చదువుతూ ఉంటే.. అక్కడే రేవతి, సుమలత, కృష్ణ, మధు విని షాక్ అవుతారు. రేవతి అయితే.. ‘అది మన ముకుందే’అని కూలబడి ఏడ్చేస్తుంది. అప్పుడే ఆదర్శ్ పైనుంచి కిందకు వస్తాడు. అంతా చూసి విని.. ‘తన చావుకి కారణం నువ్వే అని ఇప్పటికైనా తెలిసిందా?’ అంటూ కృష్ణను నిందిస్తాడు. మరి ఆ న్యూస్ లో చెప్పిన గుర్తుతెలియని అమ్మాయి ముకుందేనా? అసలు ఆదర్శ్ ఇంట్లో ఉండగలడా? భవానికి కృష్ణ ఏం సమాధానం చెప్పగలదు.. ఇటువంటి ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే.
![]() |
![]() |